ఆనందపురంలో భారీ జన సందోహంతో ప్రారంభమైన జనంతో జనసేన
ఆనందపురం ప్రతినిధి : వి న్యూస్ :ఆగష్టు 01
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను తీసుకొని జనసేన పార్టీ ముందుకు నడుస్తుందని భీమిలి జనసేన పార్టీ సమన్వయకర్త సందీప్ పంచకర్ల పేర్కొన్నారు. మంగళవారం జనంతో జనసేనలో భాగంగా ఆనందపురం కూడలి వేములవలసలోని ఎస్ సి కాలనీ లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం గడప గడపకు వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను అధికారం లేకపోయినా అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమంలో ముందుకు సాగారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం రాగానే ప్రభుత్వం అందించబోయే పలు అభివృద్ధి పథకాలు వివరించారు. అలాగే అర్హులైన యువకులకు 10 లక్షల రూపాయలు రుణ సాయం, ప్రతి ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు, ఉచితంగా ఇసుక పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం, లాభసాటి వ్యవసాయం,విశాఖ తిరుపతి ఐటి హబ్బులుగా అభివృద్ధి చేయడం వంటి విషయాలును వివరించారు.అలాగే నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలుపై జనసేన చేస్తున్న పోరాటలను వివరించారు. ఈ కార్యక్రమంలో బి.వి. కృష్ణయ్య, ఈ. యన్. ఎస్ చంద్రరావు, ఎన్. ఎన్. నాయుడు, శాఖరి శ్రీనుబాబు మరియు ఆనందపురం మండలం నాయుకులు వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.