పెళ్లంటూ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి చుక్కలు చూపించింది..!

పెళ్లంటూ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి చుక్కలు చూపించింది..!

ఆడ ముదుర్లు" ఉన్నారు జర జాగ్రత్త..


వివాహ వేదిక ద్వారా పరిచయమైన ఓ మహిళ అత్యంత చాకచక్యంగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును నిలువునా ముంచింది. ఆ వ్యక్తిని బెదిరించి రూ.1.14 కోట్లు బ్యాంకు ఖాతాకు మార్పించుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆమె సతాయింపులు భరించలేక బాధితుడు స్థానిక వైట్‌ఫీల్డ్‌ పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణం స్పందించి ఆమె ఖాతాలో ఉన్న రూ.80 లక్షలు డ్రా చేసుకోకుండా కట్టడి చేశారు. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న ఆ సాఫ్ట్‌వేర్‌ ఉన్నతోద్యోగి శిక్షణలో భాగంగా బెంగళూరు వచ్చారు. ఇక్కడే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఓ ప్రైవేట్‌ వివాహ వేదికలో తన పేరు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సాన్వి అరోరా అనే మహిళ ఆయనకు పరిచయమైంది. ఈనెల 7న ఆమె ఆయనకు వీడియో కాల్‌ చేశారు. ఆ సమయంలో కొన్ని చూడరాని నీలి దృశ్యాలను ఆమె తన చరవాణిలో బంధించారు.

అక్కడితే కట్‌ చేస్తే. మరుసటి రోజు నుంచి ఆమె వాలకం మారిపోయింది. ముందు రోజు ‘చిత్రాలు’ ఆయనకు వాట్సప్‌లో షేర్‌చేసింది. వాటిని చూసి కంగుతినడం ఆ యువకుడి వంతైంది. కాస్త డబ్బు ఇస్తే.. ఇవన్నీ ఎవరికీ చూపనంటూ హెచ్చరించింది. అలా.. ఏకంగా రూ.1.14 కోట్లు గుంజేసింది. ఇంకా కావాలంటూ ఆమె డబ్బు కోసం డిమాండు చేయడంతో ఠాణా మెట్లెక్కడం తప్ప బాధితుడికి మరేమీ గత్యంతరం లేకపోయింది. ఆమె మోసాన్ని ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు ఖాతాలను స్తంభింప చేశారు. కేసు దర్యాప్తులో ఉంది...!!