పేదలకు అందని ద్రాక్షలా నిత్యావసర వస్తువులు...! టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

పేదలకు అందని ద్రాక్షలా నిత్యావసర వస్తువులు...! టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

భీమిలి ప్రతినిధి : పెన్ షాట్ : ఆగష్టు 01:

ప్రజల అవసరాలకు.. ప్రభుత్వ తీరుకు ఎటువంటి  సంబంధం లేని విధంగా రాష్ట్రంలో వైకాపా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు దుయ్యభట్టారు. 

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై  గంటా నూకరాజు మాట్లాడారు.   రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో  లేనివిధంగా  నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయని అన్నారు.  ప్రజలు నిత్యం ఉపయోగించే  నిత్యావసర వస్తువుల ధరలను అదువు చేయలేని ప్రభుత్వానికి పాలించే అర్హత  ఉందా..?  అని ప్రశ్నించారు.  టమోటా కేజీ 180 రూపాయలు అయిందని,  అల్లం - 200,  పచ్చిమిర్చి  కేజీ 120 రూపాయలు అయిందని అన్నారు.  ఇలా బియ్యం, కందిపప్పు, కాయకూరలు అన్నింటిపై విపరీతంగా  ధరలు ఆకాశాన్నoటాయని అన్నారు.    వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు   లేక  బ్రతుకుతెరువు కోసం  ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్న పరిస్థితులు  రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు.  ఉపాధి అవకాశాలు కల్పించక, వలసలను ఆపలేక, నిత్యావసర ధరలను అదుపు చేయలేక  మరెందుకు ఈ రాష్ట్ర  ప్రభుత్వం ఉందని నిలదీశారు.  ప్రజా సంక్షేమం అంటే ఇదేనా..? అని అన్నారు.  రాష్ట్రంలో అభివృద్ధి లేదని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల నెత్తిన అప్పుల కుంపటి పెడుతున్న ఈ వైకాపా ప్రభుత్వానికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రజలకు గంటా నూకరాజు పిలుపునిచ్చారు.