దివంగత నేత పోతిన వరం 3వ వర్థంతి సందర్భంగా ఘన నివాళి.

దివంగత నేత పోతిన వరం 3వ వర్థంతి సందర్భంగా ఘన నివాళి

మధురవాడ: వి న్యూస్: ఆగష్టు 01:

మధురవాడ ప్రాంత సీనియర్ నాయకులు పోతిన వరం 3వ వర్ధంతి సందర్భంగా చంద్రంపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద వరం చిత్ర పటం ఏర్పాటు చేసి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పోతిన వరం కుమారులు పోతిన జోగి, సోదరులు పోతిన వెంకటరమణ, 7వ వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిళ్లా లక్ష్మణ,  పిళ్లా సూరిబాబు, పిళ్లా చంద్రశేఖర్, కుడితి రామారావు, పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు, పిళ్లా అప్పన్న, జగుపిల్లి నరేష్, పోతిన అచ్చియ్య పాత్రుడు, పిళ్లా రామారావు, పిళ్లా అప్పారావు, జగుపిల్లి సాయి కుమార్, పిళ్లా సూరి పాత్రుడు, పోతిన రాంబాబు, బొల్లు అప్పారావు, పిళ్లా రమణ, పిళ్లా సన్యాసిరావు, పిళ్లా శ్రీను, మరియు జనసేన నాయకులు  జగుపిల్లి నాని, గ్రామస్తులు పిళ్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు,పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిళ్లా సూరిబాబు, కుడితి రామారావు తదితరులు మాట్లాడుతూ పోతిన వరం మధురవాడ ప్రాంతం అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధికి దోహద పడ్డారని కొనియాడారు, మరియు  విశాఖ జిల్లా  నగరాలు కుల అధ్యక్షుడుగా పని చేసి నగరాలను బిసి లో చేర్చాడానికి కుల సంఘంను సమన్వయ పరిచి రాష్ట్ర నగరాలు కుల పెద్దలతో కలిసి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ద్వారా బిసి కేటగిరీ కల్పించడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు, అదే విధంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో పలు దేవాలయాలు నిర్మాణాలకు ఎంత గానో కృషి చేశారని కొనియాడారు. పూర్వం నుండి కాంగ్రెసు పార్టీలో పని చేసి ఆ పార్టీ అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయానికి కృషి చేసారని,  తరువాత 2019 సంవత్సరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ  చేరి 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, యం.వి.వి. సత్యనారాయణ విజయానికి ఎంతో కృషి చేశారని, చంద్రంపాలెం గ్రామంలో ఒక పెద్దగా ఉండి గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో ముందు ఉండి నడిపించే వారని కొనియాడారు, చంద్రంపాలెం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి గుడి నిర్మాణం లోను, కొమ్మా ది జంక్షన్ లో ఉన్న త్రిశక్తి (బంగారమ్మ అమ్మవారి గుడి) ఆలయం నిర్మాణం లోను ముందు ఉండి నిర్మాణాలు చేయించారని కొనియాడారు. పోతిన వరం లేని లోటు చంద్రంపాలెం గ్రామానికి, మధురవాడ ప్రాంతానికి, నగరాలు కుల సామాజిక వర్గానికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తీరని లోటని కొనియాడారు.