భీమిలిలో జనంతో జనసేన అట్టాసంగా ప్రారంభించిన భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల.
భీమిలి ప్రతినిధి : పెన్ షాట్ : జూలై 31:
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మా జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకుల సహకారంతో ఎన్నో ఏళ్లగా సమాధానం లేని పరిష్కారం లేని సమస్యల్ని ప్రజల నుంచి తెలుసుకుంటూ వారి గడపగడపకి అని ఈ ప్రభుత్వం దగ్గరికి వెళుతుంది కానీ వాళ్ళు గడపగడపకి మొదలుపెట్టి లాస్ట్ ఆఖరికి దాన్ని మండలం కార్యక్రమం చేసేశారు. అంటే గడప లోపలికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ప్రజలు ఆసక్తి చూపని పరిస్థితి వాళ్ళు రానివ్వని పరిస్థితి ఈ సమయంలో అసలైన సమస్యలు తెలుసుకునేoదుకు మేము జనంతో జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఎందుకంటే 2009లో ఆ పదిహేనేళ్ల నుంచి తీసుకుంటే ఎప్పుడు కేవలం గెలిచిన పార్టీ నాయకులు ఎమ్మెల్యే మాత్రమే కనపడతారు తప్ప పోటీ చేసి ఒక బలమైన ప్రతిపక్షం ఎప్పుడు కూడా నియోజకవర్గంలో కనపడకుండా కుండా పోయింది.మీ అందరూ పోటీ చేసిన మేము అనేక సమస్యలపై జనం మధ్య ఉంటూ ఈ నాలుగున్నర ఏళ్ళు ఎన్నో సమస్యలపై ఉద్యమంలో పాల్గొని ప్రజల తరుపున పోరాటం చేస్తున్నాం. కేవలం ఎన్నికల సమయంలో వచ్చే పార్టీ కాదు గెలిచినా ఓడినా జనం కోసం పని చేసే పార్టీ అని పేర్కొన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన అభివృద్ధితో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేసే విధంగా భీమిలి నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రతి ఇంటికి ప్రతి గుండెకి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తులు చెరువు చేసి వాళ్ళకి రేపటి మంచి రోజులు రాబోతున్న విషయాన్ని తెలియజేస్తూన్నాం.ఎందుకంటే భీమిలి అనేది ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతం దేశంలోనే రెండో మున్సిపాలిటీ అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం మొదటి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా సమస్యలు అలానే వున్నాయి. అర్హులు అయిన వారికి వ్యాపారం కింద పది లక్షల రూపాయల పెట్టుబడి సహాయంతో వాళ్ళు వ్యాపారవేత్తలుగా మార్చడానికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి బలమైన సంకల్పం తీసుకున్నారు. అదే విధంగా ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ప్రమాద భీమాని కూడా జనసేన పార్టీ ప్రవేశపెట్టింది.ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రతి గడపకి ప్రతి ఇంటికి ప్రతి గుండెకి గాజు గ్లాస్ గుర్తుని బలంగా చెరువు చేసి రాబోయే ఎన్నికల్లో భీమిలిలో జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.మౌలిక సదుపాయాలన్నీ ప్రజల రోడ్డు మీదకు రాకుండా ఇంటి వద్దకే సదుపాయాలు వచ్చే విధంగా జనసేన పార్టీ ఒక మాట ఇస్తూ వాళ్ళతో పాటు నడుస్తూ ఈ జనంతో జనసేన కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం మొదలుపెట్టి ఎన్నికలో జనాల్లో చైతన్యo నింపిన పవన్ కళ్యాణ్ వారహి యాత్ర వచ్చే సమయానికి భీమిలిలో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళని కూడా ఆయన ముందు నిలబెట్టాలని ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతో ఈ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం వద్ద నుంచి ప్రారంభించాము.మీ అందరి సహాయ సహకారం ఉంటుంది అని ఆశిస్తూ నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల జనసేన పార్టీ ఇంచార్జ్ మా వీర మహిళల ఆధ్వర్యంలో నేడు జనసేన పార్టీలో ఉన్న బలం ఎంత అంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా క్రియాశీల సభ్యత్వం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో నియోజక వర్గం 8000 సభ్యత్వాలతో ముందు ఉందన్నారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం బూత్ కన్వీనర్ ఈ. ఎన్. ఎస్. చంద్రరావు, బి వి కృష్ణ య్య, ఎన్. ఎన్. నాయుడు,తో పాటు నియోజకవర్గం పరిధిలోని అధిక సంఖ్యలో వీరమహిళలు, జనసైనికులు, నాయుకులు తదితరులు పాల్గొన్నారు.