రామాద్రికి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఇటుకుల వితరణ
ఆనందపురం:వి న్యూస్: జులై 31:
ఆనందపురం మండలం వేములవలస లో నిర్మిస్తున్న రామాద్రి ఆలయ గోపురం నిర్మాణానికి ఆ మండలం వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఇటుకులను అందజేశారు. గ్రామంలో నిర్మిస్తున్న రామాద్రి శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి అత్యవసరముగా అవసరమైన 4100 ఇటుకలను సుమారు రూ.30 వేల స్వీయ నిధుల వ్యయంతో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అందజేశారు. ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ నవీన్ జ్ఞానేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఆలయానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయం త్వరతగతిన పూర్తికావడానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇకముందు కూడా ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తెలిపారు.