యువగళానికి..ప్రజల మద్దతే బలం.

యువగళానికి..ప్రజల మద్దతే బలం.

మొల్లి హేమలత.జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్.

మధురవాడ: వి న్యూస్: జులై 31:

ఎటు చూసినా పసుపు జెండాలు రెపరెపలు.. స్వాగతతోరణాలు.. ప్లెక్సీలు.. పలు చోట్ల బంతిపూలు పరిచిన రోడ్లు..ఇలా ఆదివారం అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సాగిన పల్లెలన్నీ పసుపు వర్ణంగా మారాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో  జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నరు. ఈసందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ..సుదీర్ఘ పాదయాత్ర 170 రోజు.. 2,250వేల కిలోమీటర్లకు చేరుకోవడం విశేషమని అన్నారు.యువగళం పాదయాత్ర రాష్ట్ర యువతలో స్పూర్తి నింపడంతో పాటు యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నదని అన్నారు. యువగళం పాదయాత్రతో రాష్ట్రంలో టిడిపికి మరింత ఆదరణ పెరుగుతున్నదని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయకేతనం పక్కాగా ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

లోకేషను కలిసిన విశాఖ టీడీపీ నేతలు.

టిడిపి ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,కార్పోరేటర్లు పలువురు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారంతా లోకేష్తో కలసి పాదయాత్రలో పాల్గోన్నారు. వీరిలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీభరత్,పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు,మాజీ మంత్రి బండారు సత్య నారాయణ మూర్తి,ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబ, గణ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారా యణ,గండి బాబ్జి,కోళ్ల లలిత కుమారి,కార్పోరేటర్లు పాల్గొన్నారు.