అధిక శ్రవణ శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ

అధిక శ్రవణ శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ

మధురవాడ: వి న్యూస్: ఆగష్టు 01:

శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం నగరంపాలెంలో అధిక శ్రవణశుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేకువజామున నుంచి కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు అందరూ అమ్మవారికి అనేక రకాల పిండి వంటలతో భీమిలి నియోజకవర్గo మధురవాడ నగరంపాలెంలో ఉన్న శ్రీ లక్మి నరసింహ స్వామి నిలయం అయిన దేవుడు ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా అమ్మవారి సన్నిధి వరకు చేరి సారె మహోత్సవం రూపంలో పిండి వంటలు సమర్పించుకున్నారు.


ఈ కార్యక్రమంలో శ్రీ లక్మి నరసింహ స్వామి కోలాటం బృందం వారు చేసిన కోలాటం ప్రదర్శన ఎంతో గాను భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు మహిళ భక్తులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు మహిళలు పసుపు కుంకుమతో చల్లగా ఉండాలని శుక్రవారం అమ్మవారికి సారి ఇవ్వడం జరిగింది.అలాగే ఈ అమ్మవారికొక ప్రత్యేకత ఉంది గర్భం దాల్చలేని వారు ఎవరైనా అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా గర్భవతులు అవుతారని ఒక నమ్మకం అలాగే అమ్మవారు తలుచుకొని ఏ పని మొదలుపెట్టిన అది దిగ్విజయం గా పూర్తవుతుంది అని మా గ్రామ ప్రజలు అందరం నమ్ముతాము.

అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఉప్పాడ, చంద్రంపాలెం ,లక్మి వాణిపాలెం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి పిండివంటలతో సారె సమర్పించుకున్నారు అని తెలిపారు.ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన  ఆలయ కమిటీ వారికి అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోలాట బృందం గురువుని సిరిపురపు సంతోషి కి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నమని భక్తులు తెలియజేశారు.....ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.