నిరుద్యోగ యువత ! ఉచిత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.- చైతన్య, విద్యాధరి కళాశాలల అధినేత, - జామి భీమశంకర్
శ్రీకాకుళం - వి న్యూస్: ఆగష్టు 10:
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట ఎల్.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం, తేది. 11.08.23 న నిపుణ మరియు సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి, సిల్లా. రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా జాబ్ మేళాను, శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ విద్యావేత్త, చైతన్య సహకార, విద్యాధరి కళాశాలల అధినేత జామి భీమశంకర్ తెలిపారు. పది, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, ఎం.టెక్, పార్మసీ, చేసిన నిరుద్యోగులు చాలామంది ఉన్నారని కావునా నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో పే.టిఎం, యాక్సిస్ బ్యాంకు, హెడ్డిఎఫ్సి , ఐడిబిఐ, అపోలో, హెట్రో, మెడ్ ప్లస్, జిఎంఆర్ రాక్స, డెక్కన్, హ్యుందాయ్ మోబి, జెఎస్ లాబ్స్, మొదలగు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువత కోసం ఆలోచించి నిరుద్యోగరహిత నిర్మూలన కోసం ఈ జాబ్ మేళాను చేపడుతున్న సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి సభ్యులను, ఎల్.వి.ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.