ఏబీవీపీ ఆధ్వర్యంలో 28న రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల బంద్ పోస్టర్ ఆవిష్కరణ:-

ఏబీవీపీ ఆధ్వర్యంలో 28న రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల బంద్ పోస్టర్ ఆవిష్కరణ:-

మధురవాడ :పెన్ షాట్ :జులై 25: 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో జూలై 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల బంద్ నిర్వహించడం జరుగుతుందని, బంద్ పోస్టర్ ను భీమిలీ సముద్రం లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని రాష్ట ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ లోడగల అచ్చిబాబు తెలిపారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ

డిమాండ్స:-

1.బ్రాండ్ పేరునా విద్యా వ్యాపారం చేస్తున్న చైతన్య,నారాయణ తదితర కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి,

2.ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలి,

3. ఎలాంటి అనుమతులు లేకుండా జె ఇ ఇ ,నీట్ కోచింగ్ పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న ఆకాష్,అన్ అకాడమీ,వశిష్ట సంస్థలను సీజ్ చేయాలి,

4.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వేలకు పైగా ఖాళీ ఉన్న లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి,

5.ప్రతి కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఇంటర్ పర్యవేక్షణ అధికారులు చర్యలు తీసుకోవాలి,

6.అప్డేట్ అయిన హై స్కూల్స్లో సరైన మౌలిక వసతులు తగిన సిబ్బందిని నియమించాలి,

7.ప్రభుత్వ కళాశాల విద్యార్థుల దగ్గర నుండి వసూలు చేస్తున్న ఫీజులను ఆపాలి,

8.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీతో పాటు,మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి,

9.ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మౌలికగా సదుపాయాలు కల్పించాలి మరియు నీట్ ,ఎంసెట్ ,ఐఐటీ కోచింగ్లను అనుభవం కలిగిన అధ్యాపకులచే వెంటనే ఏర్పాటు చేయాలి,అని డిమాండ్స్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమిలి నగర కార్యదర్శి ఎం.రాజేష్,ఎల్ .చిన్న రవి,ఎల్ .అనిల్ కుమార్,పి .గణేష్,జగన్,దినేష్,ప్రవీణ్,బి .వంశీ,బి .శివ,కే .శివ తదితరులు పాల్గొన్నారు.