ఫ్లాష్ ఫ్లాష్ కైలాసపురంలో హత్య
విశాఖ వి లోకల్ న్యూస్ జులై 27 2023
విశాఖలో కైలాసపురం ప్రాంతం తాటిచెట్ల పాలెం హైవే బస్ స్టాప్ దగ్గర గల వైజాగ్ రెస్టారెంట్ అండ్ బార్ లో గురువారం సాయంత్రం ఏడు గంటలకి యువకుని హత్య జరిగింది .బార్ లో మద్యం సేవిస్తుండగా మృతి చెందిన ఈ యువకుడు పై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లుగా తెలుస్తున్నది.
స్థానికులు వివరాలు ప్రకారం కైలాసపురం ప్రాంతానికి చెందిన గణేష్ అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు భట్ల సింగ్ కిరణ్ 19 సంవత్సరాలు గురువారం సాయంత్రం ఏడు గంటలకి హత్య కావింపబడ్డాడు. స్థానికులు చూసేసరికి ముఖం నిండా గాయాలతో పడి ఉండడంతో 108 కి కాల్ చేసి హుటాహుటిన రప్పించారు అయితే 108 సిబ్బంది తనిఖీ చేయగా అప్పటికే మరణించినట్లుగా గుర్తించారు. హత్య ఎలా జరిగింది? ఎవరు దాడి చేశారు అని విషయాలు పూర్తిగా తెలియవలసి ఉంది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.