మహేష్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న హిందీ హీరో


 

మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.  అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని టాక్. అయితే అది విలన్ పాత్ర.. లేక ఇంకోటా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఇక జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సెట్ లో షూటింగ్ జరగనుంది.  SSMB28లో మహేష్ బాబు సరసన పూజ హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న SSMB 28 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ రానుందని తెలుస్తోంది.

అందులో భాగంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించనుందట టీమ్. దీనికి తోడు ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ గ్లింప్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లుంగీతో మాస్ లుక్‌లో అదరగొట్టనున్నారని టాక్.  గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సస్పెన్స్‌ను ఈ నెల 31తో తెరదించనున్నారని తెలిసింది.ఈ సినిమాకు“అమరావతికి అటు ఇటు” అనే కూల్ టైటిల్ ఖరారు అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే లాస్ట్ మినిట్ లో కొత్త టైటిల్ ఏమన్నా మారుతుందేమో తెలియాలి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.  తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఇక్కడ మరో విషయం ఏమంటే.. SSMB28 సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని లేటెస్ట్ సోషల్ మీడియా టాక్. మహేష్ బాబు, త్రివిక్రమ్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో మొదటినుంచి మహేష్ బాబు త్రివిక్రమ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇక గత షెడ్యూల్ కూడా సరిగా రాలేదని.. దీంతో మరోసారి రీషూట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా విషయంలో మరో రూమర్ ఏమంటే.. ఈ సినిమాకు పూజా హెగ్డే (Pooja Hedge ) హీరోయిన్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వద్దని మహేష్ చెప్పినప్పటికి త్రివిక్రమ్ తనని కన్విన్స్ చేశారని టాక్. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా కొన్ని విభేదాలున్నాయని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తల విషయంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ స్పందించారు. అలాంటిదేమి లేదని అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఓ క్రేజీ సిస్టర్ రోల్ ఉంటుందట. ఈ సినిమా కథ మొత్తం ఓ సిస్టర్ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని.. పైగా సినిమాలోనే ఈ సిస్టర్ పాత్ర చాలా కీలకమైనది అని తెలుస్తోంది. దీంతో ఈ పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట టీమ్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా మామూలుగా ఆగస్టులో విడుదలకావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా పడింది.. SSMB28 బృందం జూలై నాటికి షూట్‌ని పూర్తి చేయలేకపోవడంతో ఈసినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే సంక్రాంతిబరిలో  Project K కూడా ఉంది.


ఇక ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటన చేసింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. అయితే అదే రేంజ్‌లో ఈ సినిమాకు మార్కెట్ జరుగుతోందట. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.

వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్‌తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్‌కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట.

థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాకే దాదాపుగా ఓ 45 కోట్ల రేంజ్‌లో కోట్ చేయవచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్ర 50 కోట్ల రేంజ్‌లో, సీడెడ్ 20 కోట్ల రేంజ్ ఉండనుందని సమాచారం. మొత్తంగా 260 నుంచి 280 వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట.