ఐపీఎల్ (IPL) సీజన్ వస్తే చాలు బెట్టింగ్ (Cricket Betting) రాయుళ్లు రెడీ అయిపోతారు. మ్యాచ్ ముగిసేలోపు లక్షలు, కోట్లు సంపాదించాలని చూస్తుంటారు. అదే సమయంలో పోలీసులు ఎంటరై.. బెట్టింగ్ గ్యాంగ్స్ తో బ్యాటింగ్ ఆడేస్తున్నారు. ఐపీఎల్ టైమ్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లోని ఆదోని అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. డాన్ల నిలయంగా మారుతోంది. ఆదోని ప్రాంతంలో అంతర్రాష్ట్ర బెట్టింగ్ మాఫియా ముఠా ఉందని నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. ఈనెల 13న బెట్టింగ్ మాఫియాను పట్టుకొని రూ.80 లక్షల నగదు 20 లక్షల విలువ చేసే వాహనాలు సీజ్ చేయడంతో ఇక్కడ బెట్టింగ్ భారీ స్థాయిలోనే జరుగుతుందని అందరికీ అర్థమయిపోయింది.