మీరు మ్యాచ్ లు చూడడం ఆపేసి జాతకాలు చెప్పుకోండి
May 21, 2023
అదేం లెక్కలు భయ్యో.. చూస్తునే మైండ్ పోయింది. సన్ రైజర్స్, ఆర్సీబీ అభిమానుల సొంత న్యూమరాలజీ లెక్కలు బెడిసికొట్టాయి. హైదరాబాద్(SRH) లాస్ట్ ప్లేస్ కి సెట్ అవ్వగా.. బెంగళూరు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంతకీ ఏంటా న్యూమరాలజీ లెక్కలు.ఫ్యాన్స్ కు పిచ్చి మాములుగా ఉండదు.. అందులో బెంగళూరు(RCB), హైదరాబాద్(srh) అభిమానులకు పిచ్చి కాస్త ఎక్కువే. ఈసారి ఎలాగైనా కప్ గెలుచుకోవాలని భావించిన ఇరు జట్ల అభిమానులు స్టార్టింగ్ లో కొన్ని న్యూమరాలజీ లెక్కలు చూపించారు. అవి చూపించి ఈ సాలా కప్ నమ్దేనన్నారు.R= 18, C=03, B=02..ఈ మూడు యాడ్ చేస్తే 23 వస్తుంది.. ఈ ఇయర్ 2023.. సో ఈ సారి కప్ మాదేనని.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఊగిపోయారు. తమ జట్టును ఆపడం ఎవరి తరం కాదన్నారు. తీరా గెలవాల్సిన మ్యాచ్ లో పై ఓడిపోయారు. ఐపీఎల్ ప్లేఆఫ్ కు దగ్గరుండి మరి ముంబైను పంపించారు.ఇక సన్ రైజర్స్ అభిమానులు కాస్త ఎక్కువే కష్టపడి సీజన్ మొదట్లో లెక్కలు వేశారు. న్యూమరాలజీస్టులకు కూడా అంతుబట్టని ఆ లెక్కలు చూసి అప్పట్లోనే చాలా మంది ముక్కున ఫింగర్ వేసుకున్నారు.2016 సీజన్‌లో తొలిసారి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ అంతకుముందు రెండు సీజన్లలో 2014, 2015 సీజన్లలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. వరుస సీజన్లలో ఆరో స్థానంలో నిలిచిన ఆరెంజ్ .. 2016లో మాత్రం టైటిల్ గెలిచింది.