అక్రమ లావాదేవీల పై కూడా ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించాలి.
విశాఖపట్నం :వి న్యూస్ :ఏప్రిల్ 25
మొత్తం ఆస్తి అయిదు కోట్లే... ప్రతి ఏటా ఖర్చులు ఏమో పదులకోట్లలో... ఇది ఎలా సాధ్యం బాలినేని గారు?బాలినేని సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి మూడు కోట్ల రూపాయలు. ఆయన సతీమణి ఆస్తి మరో రెండు కోట్లు. మొత్తం ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న బాలినేనికి నెలవారీ వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఏమీ లేదు. ఆయన పూర్తి సమయం పొలిటీషియన్. వ్యాపారాలు ఏమీ లేవు. అయినా ఆయన ఖర్చులు మాత్రం కోట్ల రూపాయల్లోనే. రెండు, మూడు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేసి ఏటా ఆయన తన మనవడి జన్మదినోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. ఆయన జన్మదిన వేడుకలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు తోనే. ఈ ఏడాది ఆ వేడుకలు గోవాలో జరిగాయి.ఇటీవల ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. అంతకుముందు అత్యంత విలాసవంతమైన విదేశీయానాలకు ప్రత్యేక విమానంలో స్నేహితులతో వెళ్లి వచ్చారు. అమెరికా ట్రిప్ కి రెడీ అవుతున్నారు. ఇవేవీ అధికారికం కాదు. సొంత ఖర్చులతో జరిగేవి. వీటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో బాలినేని గారు చెప్పగలరా. వీటన్నింటికీ మించి జూదం తన వ్యసనమని ఆయన బహిరంగంగానే అంగీకరిస్తారు. అందుకోసం ఆయన కోట్ల రూపాయల్ని కేటాయిస్తారని ఒంగోలు వాసులకే కాదు, రాష్ట్ర రాజకీయ నాయకులు అందరికీ తెలిసిందే. ఏ వ్యాపారం లేని నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయి.? దీనిపైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించారు.
బినామీ భాస్కర్ రెడ్డి లావాదేవీలపై ఐటీ దృష్టి సారించాల్సిందే
కుండా భాస్కర్ రెడ్డి పెద్దగా చేసే వ్యాపారాలు ఏమి కనిపించకపోయినా ఆయన కొద్ది సంవత్సరాలలో వేయి కోట్లకు పైగా లావాదేవీలను అధికారికంగానే చూపించారు. విశాఖ దసపల్ల కొండపై ఆయన 60 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించారు. అచ్చుతాపురం లేఔట్లో కొంత భాగాన్ని 2019 ఎన్నికలకు ముందు తాను స్లీపింగ్ పార్టనర్ గా వున్న ఆండ్రూ మినరల్స్ కు 50 కోట్ల రూపాయలకు విక్రయించి నట్లు చూపించి అవే భూములను ఈ ఏడాది మార్చిలో తిరిగి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది కేవలం మనీ లాండరింగ్ కోసమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బృందం తెలంగాణ రాష్ట్రం చిలుకూరులో 111 జీవో పరిధిలోకి వచ్చే 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన 1150 గజాల గృహ నిర్మాణ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ కొనుగోళ్లు, అక్రమ లావాదేవీలు అన్నిటి పైన విచారణ జరపాలని ఆదాయ పన్ను శాఖను మరో మారి కోరుతున్నాం. ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అమరావతి నుంచి మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించగా ఆ సమయంలో కొంతకాలం విశాఖ నుంచి వియ్యంకుడు అయిన భాస్కర్ రెడ్డి అక్రమ లావాదేవీల కోసం కాలుష్య నియంత్రణ మండలి కి చెందిన సొంత సామాజిక వర్గ అధికారి ఒకరు ఓఎస్డి గా విశాఖ లో పని చేశారు. విశాఖ నిర్మిస్తున్న ఇంటి సెల్లార్లో ప్రతిరోజు బాలినేని కి సంబంధించిన విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో భాస్కర్ రెడ్డి సమావేశాలు , సమీక్షలు జరిపి సెటిల్మెంట్లు చేసేవారు. వీటన్నిటి కారణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ బాలినేని ని మంత్రి పదవి నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ అధికార పార్టీలో బాలినేని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
సవాలుకు సిద్ధం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు స్వేచ్ఛనిచ్చి విచారణకు ఆదేశించాలి
బాలినేని ఆయన వియ్యంకుడు సవాలను స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని ఆయన బినామీ భాస్కర్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం. అచ్యుతాపురం ,ఒంగోలు లేఔట్లపై విచారణకు ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలి. ఇందులో కబ్జాలు ,అక్రమాలకు పలు శాఖలతో సంబంధం వున్నందున వారందరితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. భాస్కర్ రెడ్డి, బాలినేని సవాల్ ను స్వీకరించి ఇందులో అక్రమాలు ఉంటే జగనన్న కాలనీలుగా మార్చి పేదలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదాయం పన్ను శాఖ కూడా అక్రమ ఆర్థిక లావాదేవీలు మనీ లాండరింగ్ పై విచారణ జరపాలి.

