ఉత్తరాంద్ర తూర్పుకాపు నేతల్లో ఐక్యత తీసుకువస్తున్న మోహన్ కుమార్

ఉత్తరాంద్ర తూర్పుకాపు నేతల్లో ఐక్యత తీసుకువస్తున్న మోహన్ కుమార్:-

ఉత్తరాంద్ర:

ఇటీవల ఉత్తరాంద్ర తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణం కోసం కోటిన్నర విలువచేసిన స్థలాన్ని ఉచితంగా తూర్పుకాపు జాతి కోసం అంకితం చేసిన ఉత్తరాంద్ర తూర్పుకాపు యువనేత గంటెడా మోహన్ ప్రస్తుతం ఉత్తరాంద్ర తూర్పుకాపు నేతలు అందర్ని కలిసి అందర్ని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి అందరిలో ఐక్యత తెచ్చే పనిలో నిమగ్నం అవ్వడం పట్ల ఉత్తరాంద్ర తూర్పుకాపు నేతలు హర్షం వ్యక్తం చేసారు. కులం అభివృద్ధి పట్ల చిన్న వయసులో మోహన్ కి ఉన్న అంకిత భావం పట్ల సంఘం పెద్దలు చాలా సంతోషం వ్యక్తం చేసారు. ఇటీవల విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో జరిగిన ఉత్తరాంద్ర తూర్పుకాపు మీటింగ్లో త్వరలో భవన నిర్మాణం కోసం కమిటీ వేసి తొందర్లోనే పనులు మొదలు పెడతామణి ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు యెన్ని శ్రీనివాస్, తుమ్మగంటి సూరినాయుడు, సేపేనా శ్రీనుబాబు, లోలుగు అప్పలనాయుడు, విసినిగిరి శ్రీనివాస్, ఇజ్జుపురపు శ్రీనివాస్, యార్లంకి రాజేశ్వరనాయుడు తదితరులు పాల్గున్నారు.