అంబానీకి కాబోయే కోడలు 'బ్యాగు'పైనే చర్చ.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!..కేవలం 52లక్షల30వేలు మాత్రమే.

అంబానీకి కాబోయే కోడలు 'బ్యాగు'పైనే చర్చ.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!..కేవలం 52లక్షల30వేలు మాత్రమే.

ఇండియా :

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్టు నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె తీసుకొచ్చిన చిన్న బ్యాగుపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని ధర తెలిస్తే తప్పకుండా షాక్ కావాల్సిందే. ఇంతకి దాని ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్‌షాదీస్.కామ్ లో పబ్లిష్ అయిన నివేదిక ప్రకారం ఈ చిన్న బ్యాకు ధర రూ. 63,750 డాలర్లు అంటా భారత కరెన్సీలో రూ.52, 30,000. ఈ బ్యాగ్ మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్ మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన పొడవాటి గొలుసు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాగు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.