నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దారపనేని.....
కనిగిరి మార్చి 30 వి న్యూస్ ప్రతినిధి:
కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలకు కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారు సీతా రాములవారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తానని ఆ సీతారాముల కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు చాలవని ఆ పుణ్యదంపతుల కళ్యాణంతో మన జీవితాలలో కొత్త వెలుగులు నిండుతాయని, కళ్యాణం వలన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని ప్రజలకు అపారమైన నమ్మకం అని సీతారాముల కళ్యాణం వలన సిరిసంపదలు చేకూర్తాయని దేశం, రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా వర్ధిల్లుతాయని దారపనేని ఆకాంక్షించారు. సీతారాముల కళ్యాణంతో ప్రతి గ్రామంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని దారపనేని పేర్కొన్నారు.

