ఏప్రిల్ ఐదున ఛలో డిల్లీ ని జయప్రదం చేయండి

ఏప్రిల్ ఐదున ఛలో డిల్లీ ని జయప్రదం చేయండి

గ్రామీణ ఉపాధి హమి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కౌలు రైతులకు సమగ్రమైన చట్టం చేయాలని డిమాండ్లుతో ఈనెల 5 చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పిలుపునిచ్చారు బుదవారం ఉపాధి కూలీలు పనులు చేస్తున్న ప్రాంతంలో కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించి నిర్సనులు తెలిపారు అనంతరం అయిన మాట్లాడారు,కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత ప్రజలుపై బారాలు ఎక్కువ అయ్యాయని తెలిపారు

పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే పేదలంతా ఐక్యమై ఉద్యమించడం తప్ప వేరే మార్గం లేదన్నారు.రైతులకు వ్యతిరేకంగా కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతు ఉద్యమం స్ఫూర్తితో ఉద్యమించాలని అందుకోసం కార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు ఏకమై ఏప్రిల్ 5 న లక్షలాది మందితో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టాం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మన అనకాపల్లి జిల్లా నుండి వందలాదిగా వ్యవసాయ కార్మికులు సన్న చిన్నకారు రైతులు కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేసారు ధరలు విపరీతంగా పెరిగి పోవడం పేదలు కనుగోలు శక్తి తగ్గ పోవడం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేటి కరణ వంటి సమస్యలు దేశంలో ఎక్కువ అయ్యాయని తెలిపారు,   

ఉపాధి హామీ పథకానికి కేంద్రం బడ్జెట్లో సంవత్సరానికి రెండు లక్షల 40 వేల కోట్లు కేటాయించాలి. సంవత్సరంలో ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని, రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలి. సమ్మర్ అలవెన్సు ఇతర అలవెన్స్లు,మస్టర్ విధానం పాత పద్ధతిలో కొనసాగించాలి.

 పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని. సంపన్నుల పై పన్నులు వేసి వాటిని పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలి.

 కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ప్రకారం రాష్ట్రంలో మిగులు భూములు బయటకు తీసి పేదలకు పంచాలని

 మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి.

 పెండింగ్ లో ఉన్న భకాయిలు వెంటనే చెల్లించాలి డిమాండ్ చేసారు,ఈకార్యక్రమంలో అదిసంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.