స్టేడియం పరిసర ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం.
మధురవాడ:
మ్యాచ్ నిర్వహణ కష్టమే అంటున్న విశాఖ వాసులు.
తోలి మ్యాచులో కష్టపడి గెలిచిన టీమిండియా.. సిరీస్ ను ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు రెడీ అయింది. ఇవాళ మద్యాహ్నం 1:30 విశాఖపట్నంలో ఆడే రెండో వన్డే మ్యాచ్ జరగడం కష్టంగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి విశాఖపట్నంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి వాన మబ్బులు కమ్ముకుంటున్నాయి. దీంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఇప్పటికే గ్రౌండ్ స్టాఫ్ గ్రౌండ్ మొత్తాన్ని రెయిన్ కవర్స్ తో కప్పి ఉంచారు. మరోవైపు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు మ్యాచ్ జరగదని ఫిక్స్ అయి టికెట్స్ ను సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు. అటు మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.

