సమాజానికి దిక్సూచి పాత్రికేయులు వర్థమాన నటుడు కంచర్ల ఉపేంద్ర
ఘనంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శోబాకృత్ నామ ఉగాది సంబరాలు
విశాఖపట్నం వి న్యూస్ మార్చి 18
సమాజానికి దిక్సూచిగా ఉన్న పాత్రికేయుల సంక్షేమానికి తమ సంస్థ అండగా నిలుస్తుందని వర్తమాన సినీ నటుడు కంచర్ల ఉపేంద్ర హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సహకారంతో తామ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అల్లూరి విద్యాన కేంద్రంలో శనివారం నిర్వహించిన శోభకృత్ నామ ఉగాది సంబరాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని అవసరమైన వారికి తమ సంస్థ సహకారo అందిస్తున్నామని ఆయన చెప్పారు. తమ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిర్దిష్టమైన లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారంభించిన తమ సంస్థ ఎన్నో విజయాలు నమోదు చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం సహా వృత్తి పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా ఒక భవన నిర్మానించే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఈ ఏడాది విభిన్న కార్యక్రమాలతో జర్నలిస్టులకు భరోసాగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. వృత్తిపరమైన అంశాలపై జర్నలిస్టులకు త్వరలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.
నగర పరిధిలోని మధురవాడ జోన్ కు చెందిన పాత్రికేయులు మొజ్జాడ శ్రీను(ఈనాడు),మానం శ్రీను(వైజాగ్ ఎక్స్ ప్రెస్)లతో పాటుగావివిధ జోన్ లకు చెందిన పాత్రికేయులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ వేదికపై ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ రూపొందిస్తున్న వర్ధమాన హీరో ఉపేంద్ర నటించిన అనగనగా కథలో పోస్టర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు దుస్తులు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ,అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.


