భీమిలి నీడీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 3వ నేత్ర వైద్య శిబిరం
భీమిలి:
భీమిలి నీడీ వెల్ఫేర్, శంకర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరంతగరపువలసలో లక్ష్మీ విజయ హాస్పిటల్ ప్రాంగణంలో పేదవారికి ఉచిత నేత్ర విద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీ.ఎన్.డబ్ల్యూ వ్యవస్థాపకులు కైతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గతంలో సుమారు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 72 మందికి కళ్ళజోళ్ళు అందించడం జరిగిందని, శంకర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎస్ జోగారావు మాట్లాడుతూ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని, దారి ఖర్చులు కూడా శంకర్ ఫౌండేషన్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ విజయ హాస్పిటల్ అధినేత దంతులూరి రామభద్రరాజు
బి.ఎన్.డబ్ల్యూ సభ్యులు పి. అరుణ్ కుమార్, బసవ కృష్ణ మూర్తి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, మేన్ రెడ్డి, జీఆర్ ఉమ, వాండ్రాసి సతీష్, దలై శివ, శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు దివ్య, విజయ తదితరులు పాల్గొన్నారు.

