ఘనంగా అంబేద్కర్ కాలనీ నూకాలమ్మ జాతర
మధురవాడ:
ముఖ్య అతిధి గా పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్న 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ పరిధి ఐదో వార్డ్ అంబేద్కర్ కాలనీ లో ఈరోజు నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ జాతర మహోత్సవాల్లో ఐదో వార్డ్ కార్పొరేటర్ దంపతులు మొల్లి హేమలత రమణ ముఖ్య అతిథిలుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
కాలనీ పెద్దలు కార్పొరేటర్ దంపతులను శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమం లో మొల్లి హేమలత మాట్లాడుతూ ఈ కాలనీ లో ప్రతి సంవత్సరం నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుపుతారని వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కరుణ కృప పొందుతారని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కంబపు కామరాజు, వార్డ్ టిడిపి ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు,నాగేశ్వరరావు,రాజ,ఆదినారాయణ,కృష్ణమూర్తి,రమేష్, జగదీష్ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)