వైసీపీ నుండి టిడిపిలో భారీ చేరికలు.

వైసీపీ నుండి టిడిపిలో భారీ చేరికలు.

పల్నాడు:

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన కందుల కృష్ణారెడ్డి,గుమ్మ చిన్న అబ్బాయి రెండు కుటుంబాలు అధికార వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు సమక్షంలో చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికై పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక స్థానం కల్పిస్తుంది అన్నారు. అధికారం వైసిపి అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు టిడిపిని ఆదరిస్తున్నారని అన్నారు. 

పార్టీ అభ్యున్నతికి పనిచేసే ప్రతి కార్యకర్తకు టిడిపి అండగా నిలుస్తుందని తెలిపారు. చింతలచెరువు నుండి టిడిపిలో చేరిన కృష్ణారెడ్డి, చిన్న అబ్బాయి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో...మండల పార్టీ అధ్యక్షుడు మీసాల మురళీ కృష్ణ యాదవ్,సీనియర్ నాయకులు వంకాయల పాటి పేరయ్య, ముండ్రు సుబ్బారావు, గంగినేని చంద్రశేఖర్, పలువురు మండల టిడిపి నాయకులు కట్టెంపుడిబర్నా,యువత అనిల్ కుమార్ గ్రామ నాయకులు పాల్గొన్నారు,