ఎండ తీవ్రత తప్పించుటకు పూనుకున్న గౌతమ్ విద్యా సంస్థలు...
కంభం:
- ఎండ తిర్వత తీర్చుటకు ముందుకు వచ్చిన యోగి వేమన రెడ్ల సంఘం
- కార్యక్రమంలో పాల్గొన్న ఎన్.సి.సి మరియు ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు
- కార్యక్రమం జరిగించిన గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రిన్సిపల్ రవి కుమార్
కంభం మార్చి 21 (వి న్యూస్)
ప్రకాశం జిల్లా కంభం మండలం లోని స్థానిక గౌతమ్ విద్యా సంస్థలు విద్య లోనే కాక అనేక సహకార కార్యక్రమాల్లో ముందంజలో పాల్గొంటుంది.ప్రస్తుత ఎండాకాలం సమయంలో దాహం తీర్చుటకు ఒక మంచి ఆలోచనలతో కంభం మండలం లోని కాలేజ్ రూట్ లో మంచి నీరు మరియు మజ్జిగ పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ చేగిరెడ్డి రామ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.పండుగ సమయంలో ఎంతో రద్దీగా ఉంటున్న జనానికి గొంతు తడి తిర్చినందుకు ప్రజలు ఆనందం వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా గౌతమ్ విద్యా సంస్థల ఎన్.సి.సి మరియు ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక పట్టణ మరియు అనేక ప్రాంతాల ప్రజలు పాల్గొని దిగ్విజయంగా జరిగించారు.
- ప్రిన్సిపల్ ఎ.రవి కుమార్ మాట్లాడుతూ...
కార్యక్రమం అనంతరం గౌతమ్ విద్యా సంస్థల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రవి కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండా కాలం కనుక ప్రజల దాహం తీర్చుకొనుటకు చైర్మన్ చేగిరెడ్డి రామ భూపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.అలానే కార్యక్రమం జరుగుటకు సహకరించిన యోగి వేమన రెడ్ల సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రామ భూపాల్ రెడ్డి,డిగ్రీ ప్రిన్సిపల్ రవి కుమార్,ఉపాధ్యాయులు సుదర్శనం అలానే దుర్గ మరియు ఎన్.సి.సి ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.



