దివ్యాంగులు పట్ల మానవత్వంతో తమలోని సేవ గుణాన్ని చాటుకున్న రెవెన్యూ సిబ్బంది

 దివ్యాంగులు  పట్ల మానవత్వంతో తమలోని సేవ గుణాన్ని చాటుకున్న రెవెన్యూ సిబ్బంది..

               విశాఖ వి న్యూస్  2023 మార్చ్ 13        

     నగరంలో జరుగుతున్న పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో చిన్నగదిలి మండలం తహసిల్దార్ సనపల.రమణయ్య ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ  అధికారులు మరియు సిబ్బంది అలాగే  ఎన్నికల విధులను ఒకవైపు సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు చిన్న గదిలి మండలం పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్న , దివ్యాంగులు నడవలేని వారి పట్ల మానవత్వంతో తమలోని సేవ గుణాన్ని చాటుతున్నారు.


నడవలేని స్థితిలో వున్న వారిని, వీల్ చైర్ లో  తమ స్వహస్తాలతో మోసుకెళ్తు వారి ఓట్ హక్కును వినియోగించుకోవడంలో సహాయం అందించారు.మానవతా దృక్పథంతో వారికి సహాయం చేసిన చిన్న గదిలి  రూరల్  మండలం తహసీల్దార్  సనపల రమణయ్య కు మరియు  రెవెన్యూ  సిబ్బందికి ఆర్ ఐ లు., వి ఆర్ ఓ. మరియు పోలీస్ సిబ్బందికి,తదితరులు కు స్పందించిన తీరుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.