విజయవంతంగా అల్లూరి విలేకరుల నెలవారి సమావేశం

*విజయవంతంగా అల్లూరి విలేకరుల నెలవారి సమావేశం* 

అల్లూరి జిల్లా :

*ఏపీటీఆర్ఏ కార్యదర్శి ఉపాధ్యక్షులు గిరి,శంఖర్ లకు సాధారంగా ఆహ్వానం*

*సంఘా బలోపేతం గురించి చర్చలు*

అల్లూరి విలేకరుల సంక్షేమ సేవా సంఘం ప్రతినెల నెలవారి సమావేశం గురువారం అధ్యక్ష కార్యదర్శులు సంఘ సభ్యులతో విజయవంతంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కోడా వెంకట సురేష్ కుమార్, కొర్రా కృష్ణ రావులు మాట్లాడుతూ.... అల్లూరి విలేకరుల సంఘం బలోపేతానికి ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా సంఘానికి కట్టుబడిగా ఉండాలన్నారు. సంఘ సభ్యుల ఆమోద తీర్మానంతోనే సంఘ బలోపేతానికి ముడిపడి ఉంటుంది కాబట్టి సంఘ సభ్యులు అందరూ తమ బాధ్యతల్ని విస్వరించకుండా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అల్లూరి విలేకరుల సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించగలిగేయమని రానున్న రోజుల్లో కూడా మరింత సేవా కార్యక్రమాలు చేపట్టుటకు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు బుజాస్కంధాలు మీద మొయ్యాల్సినటువంటి అవశ్యకత ఎంతైనా ఉందని వారన్నారు. సేవే పరమవాదిగా భావించి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగిందని మానవసేవే మాధవసేవగా సేవ దృక్పథంలో ఉన్న సంతృప్తి వెలకట్టలేనిదని ఈ సేవ సంతృప్తి పొందుతుంటే ఎంతో అదృష్టాన్ని వరిస్తున్నట్లుగా భావిస్తుందని వారన్నారు. అల్లూరి విలేకరుల సంక్షేమ సేవా సంగం చేస్తున్న సేవా కార్యక్రమాలను తిలకించి ఆకర్షితులై ఏపీటీఆర్ఏ కార్యదర్శిగా పనిచేస్తున్న గండేరు పరిజాతం(గిరి)కంబిడి శివశంకర్ లతో పాటు నూతనంగా ప్రైమ్ నైన్ విలేఖరి శివకుమార్ అల్లూరి సంఘానికి చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు వసపరి డేవిడ్ రాజ్, ఉపాధ్యక్షులు పోతురాజు వెంకట్రాజు, వైస్ ప్రెసిడెంట్ కిల్లో నాగేశ్వరరావు( ప్రేమ్ కుమార్), కోశాధికారి శ్రీహర్ష జనపరెడ్డి, లీగల్ అడ్వైజర్ నాడేలి రామకృష్ణ, పి ఆర్ ఓ గుజ్జేలి నాగేశ్వరరావు,వంతల రాజు, తదితరులు పాల్గొన్నారు.