జోడుగుల్లపాలెం సముద్ర తీరంలో వ్యర్దాలను తొలగించిన జోన్ 2కమీషనర్ కనకమహాలక్ష్మి.
జోడుగుల్ల పాలెం:
జీవీఎంసీ జోన్2 పరిధి జోడుగుల్ల పాలెం సముద్ర తీరంలో వ్యర్ధాల తొలగింపు కార్యక్రమాన్ని జీవీఎంసీ జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. జోడుగుల్ల పాలెం సముద్ర తీరం లో జోన్ 2కమీషనర్ ఆమె స్వహస్తలతో వ్యర్థ్యాలను తొలగిస్తూ సిబ్బంది ఉత్సాహంతో పాల్గొనే విధంగా వారిలో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో కే కనక మహాలక్ష్మి మాట్లాడుతూ సముద్ర తీరంలో నివసిస్తున్న ప్రజలు, పర్యటనకు వచ్చిన పర్యాటకులు సముద్ర తీరం పరిశుభ్రంగా ఉండేవిధంగా ఉండాలని సముద్ర తీరంలో చెత్త వెయ్యకుండా చెత్త డబ్బాలను ఉపయోగించి జీవీఎంసీ వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది, సచివాలయం శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

