ఇది కూడా నా బాధ్యతే కదా ... ట్రాఫిక్ కానిస్టేబుల్ శివ కుమార్
అభినందించిన సైబరాబాద్ కమిషనరేట్ ఎస్ఐ కాసుల అరుణ్ కుమార్
శ్రీకాకుళం:
రక్తం అవసరమైతే వంద ఫోన్లు చేసి మాకు రక్తం అవసరం సర్, చాలా అర్జెంటు అని అడిగేవాళ్లే, వేరొకరికి అవసరం అయినప్పుడు రక్త దాతలుగా మారటం లేదని సైబరాబాద్ కమిషనరేట్ ఎస్ఐ అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. రక్త దానంకై యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని, యువకులతో సమానంగా యువతులు కూడా రక్తదానం చెయ్యటం ఆనందంగా ఉందన్నారు. రక్త దానంపై అపోహాలు వీడి పది మంది ప్రాణాలు కాపాడాల్సిన బాద్యత మనందరిదని తెలిపారు. మెడికవర్ సైదారాబాద్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ కు అత్యవసర పరిస్థితిలో ఏ పాజిటివ్ అవసరం కాగా, కుటుంబ సభ్యులు ఆ నలుగురు సేవా సంగం సభ్యులైన సైబరాబాద్ కమిషనరేట్ బీడి టీం లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ ని సంప్రదించగా, మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్, టిటిఐ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ లో విధులు నిర్వహిస్తున్న శివకుమార్ తన రక్తపు బొట్టుని స్వచ్ఛందంగా దానం చేసారు. అనంతరం మాట్లాడుతూ నేను ప్రతీ మూడు నెలలకు ఒక సారి తప్పకుండా రక్త దానం చేస్తానని, ఇది కూడా నా బాధ్యతే కదా అని తెలిపారు. అనంతరం ఎస్ఐ కాసుల అరుణ్ కుమార్ రక్త దాతను అభినందిస్తూ అందరూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఆదర్శంగా తీసుకొని అందరూ రక్తదానం చెయ్యాలని కోరారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్, న్యూ బ్లడ్ బ్యాంకు శ్రీకాకుళం, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం, ప్రాణదాత పలాస సభ్యులు ఎస్ఐ కాసుల అరుణ్ కుమార్ ను, ట్రాఫిక్ కానిస్టేబుల్ శివకుమార్ ను, శ్రీకాకుళం కి చెందిన "ఆ నలుగురు సేవా సంఘాన్ని" అభినందించారు.

