పేదలకు రమా ఫౌండేషన్స్ వితరణ

పేదలకు రమా ఫౌండేషన్స్ వితరణ

* పేదలకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలి.

* సాటివారికి సేవ చేయడమే మానవత్వం.

*రమా ఫౌండేషన్స్ వ్యవస్థాపక చైర్ పర్సన్ కట్టా రమాదేవి


నూజివీడు, ఫిబ్రవరి 6 :

నూజివీడు పట్టణంలోని గాంధీనగర్ లో గల కాంక్రీట్ కార్మికులు, నిత్య కూలీలకు రమా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయలు, పండ్లు, పోషకాహారమైన డ్రైఫ్రూట్స్ సోమవారం వితరణగా అందించారు. ఈ సందర్భంగా రమా ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రముఖ సామాజికవేత్త కట్టా రమాదేవి మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడని కార్మికులకు పోషకాహారం పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తోటి వారికి సాయం చేయడం అందరి బాధ్యత గా గుర్తించాలి అన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడడం కంటే, ఎవరికి వారు తమకు అవకాశం ఉన్నంతవరకు తోటి వారికి, సమీపములోని పేదలకు సాయం చేయడంలోనే మానవత్వం దాగి ఉందని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కట్టి కుదిపిన తరువాత కార్మికులు ఉపాధి అవకాశాలను పూర్తిగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెసులుబాటు కలిగి ఉన్న ఆదాయ వనరుల నుండి అవకాశం మేరకు సాయం చేస్తూ దాతృత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఎదుటి వ్యక్తిలో దైవత్వాన్ని వీక్షించి, వారి ఆకలి తీర్చడం సాటివారిగా మన ధర్మం గా భావించాలన్నారు.