ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారవు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారవు.

సలుగు:

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు మండలం,సలుగు పంచాయితీ, డబ్బగరువు గ్రామం, లో రహదారి లేక ఒక ఇల్లు కట్టు కొనేందుకు ఎంతో కష్ట పడి

భారం మోస్తున్నరు.

కాల నడకలు, నడవడానికి సరైన రహదారి లేదు.ఒక్క గర్భిణీ

స్త్రీలు హాస్పిటల్ కి తీసుకువెళ్లాలన్నా చాలా

ఇబ్బంది పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇచ్చే ఇల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పుకొచ్చారు.ఏ ప్రభుత్వము వచ్చిన మా బ్రతుకులు ఇలాగే ఉంటున్నాయి కానీ మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం జరగడం లేదని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే రేసన్ బియ్యం

తెచ్చు కోవాలన్న, తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని  ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే

ఈదుల పాలెం హాస్పిటల్

కి వెళ్ళాలన్న 5 కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాలి.

దబ్బ గరువు నుండి గుల్లి వరకు 4కిలో మీటర్లు

దూరం అలాగే దబ్బ గారువు నుండి

సలుగు వరకు 4కిలోమీటర్ల దూరం నడవాలి.  అలా వెళితే  తప్ప హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంద అవకాశం లేదు అని చెప్పారు. మా సమస్యలు పరిష్కారం  కోసం ఉన్నత అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధ కలిగిస్తుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.