దేవదాశాఖ అదికారులు చేతులు కట్టేసిన అధికార పార్టీ పెద్దలు

దేవదాశాఖ అదికారులు చేతులు కట్టేసిన అధికార పార్టీ పెద్దలు

దేవరాపల్లి:

దేవరాపల్లి మండలం,మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో కోట్లాది రూపాయలు విలువ చేసె  23 ఎకారాల 15 సేంట్లు దురఆక్రమణకు గురైన దేవుని మాన్యానికి అన్ని అదారాలున్న స్వాధీనం చేసుకోలేని నిస్సాహాయిత స్థితిలో దేవదాశాఖ అదికారులు ఉన్నారని దేవదాశాఖ శాఖ అధికారులకు అధికారపార్టీ పెద్దలు పూర్తిగా చేతులు కట్టేసారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పెర్కోన్నారు బుధవారం అయిన ఓప్రకటన విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడారు ఈభూమి పూర్వం సెటిల్ మెంట్ కు ముందు 10, (1) లో ఈభూమి మారేపల్లి గ్రామానికి చేందిన ఆవుగడ్డ సఖూరినాయుడు ధర్మ కర్తగా ఉన్నారని,1956 లో భూమి సేటిల్ మేంట్ అయిన తరువాత మారేపల్లి శ్రీ రాములు వారి పేరున నమోదు అయ్యిందన్నారు దిన్ని తారువా గ్రామానికి చేందిన వ్యక్తులకు ఎవిదంగా దఖలు పడిందని ప్రశ్నించారు,ఈభూమి ఆక్రమణ గురైయిందని దీనిపై ఆక్రమణ దారునికి ఎటువంటి అదికారులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు ట్రిబ్యునల్  కు వెళ్ళాలని,భూములు అమ్మిన వ్యక్తులు కోనుగోలు చేసిన రీయల్ ఎస్టేట్ వ్యాపారికి ఎటువంటి పాస్ బుక్కలు ఇవ్వరాదని స్పష్టం చేస్తు గతంలో ఉన్న అనకాపల్లి దేవదాశాఖ అస్టేంటు కమీషనర్ తేదీ 14జూన్ 2022,న దేవరాపల్లి తహశీల్దార్ వారికి వ్రాయడం జరిగిందన్నారు దీని అదారంగా తహశీల్దార్ రీయల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పటికి మూడు సార్లు పాస్ బుక్కలు తిర్కరించారని తెలిపారు,ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు చట్టం లోని సెక్షన్ 81ప్రకారం ఎదైనా మతపరమైన స్థిరఅస్తి అమ్మకం, లేదా అక్రమణ చేల్లదన్నారు,ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులోపుల్ బెంచ్ రిపరెన్స్ లో ఉదహరించిన తీర్పు లో దార్మిక మరియు మతపరమైన ఎండోమెంటు,యొక్క స్థిరమైన ఆస్తులు, సెక్షన్ 43 ప్రకారం, అక్రమణదారునికి హక్కులు ఉంటే ఎండోమెంటు యాజమాన్యంను సవాల్ చేస్తు కోర్టుకు,వెళ్ళాలని అట్లు చేయని ఎడల అక్రమణదారునికి ఎటువంటి హక్కులు ఉండవన్నారు, ఎండోమెంటు పాత సెక్షన్ 38/25 రిజిస్టర్లు ప్రకారం కూడా ఓక్కసారి రెవెన్యూ సెటిల్ మెంట్ పేయిర్ అడంగల్,లో మతపరమైన హస్తిగా రికార్డుల్లో నమోదు అయితే అది ఎండోమెంటు భూమి క్రిందనే ఉంటుందని దేవదాశాఖ చట్టం స్పష్టం చేయబడిందిన్నారు,దీని  ప్రకారం భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారికి తేదీ 12సెప్టెంబర్ 2022 న పిర్యాదు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లా అస్టేంటు కమీషనర్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా అస్టేంటు కమీషనర్ కు పలుమార్లు పిర్యాదులు చేయడం జరిగిందని తెలిపారు,దింతో దేవదాశాఖ అస్టేంట్ కమీషనర్ అనకాపల్లి వారు వారి సబ్బందితో భూములు పరీశీన చేసి ఆక్రమణకు గురైనట్లు గుర్తించడం జరిందన్నారు ఆక్రమణ దారునికి నోటిషులు ఇస్తామని చేప్పిన ఇప్పివరకు ఎటువంటి నోటీసులు ఇవ్వలెదన్నారు

దేవదాశాఖ అదికారులకు అదికార పార్టీ పెద్దలు పూర్తిగా చేతులు కట్టేసారని తెలిపారు,అధికారం ఉంటే దేవుని భూములు కూడా అమ్మేసు కోవచ్చాన్న అధికార పార్టీ పెద్దలకు త్వరలో ప్రజలే గునపాఠం చెబుతారని స్పష్టం చేశారు వెంటనే దేవదాశాఖ అదికారులు ఎటువంటి రాజకీయ వత్తిళ్ళుకు తలవగ్గకుండా భూమిని స్వాధీనం కోని రీయల్ ఎస్టేట్ వ్యాపారులు నుండి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాపాడాలని వెంకన్న డిమాండ్ చేసారు.