ఢిల్లీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు.

ఢిల్లీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు.

ఢిల్లీ:

ఢిల్లీ: దేశంలో అక్కడక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 నిమిషాల  సమయంలో ఢిల్లీ - ఎన్సీఆర్,ఉత్తర, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.పలు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే,ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిసింది.