బొబ్బిలి తాండ్ర పాపారాయుడు 266వ వర్ధంతికి ఘన నివాళులు.
బొబ్బిలి:
బొబ్బిలి తాండ్ర పాపారాయుడు మరియు రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం తాండ్ర పాపారాయుడు 266వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన మరిశర్ల వెంకటేశ్వరరావు. మంగళవారం తాండ్రపాపారాయుడు 266 వర్ధంతిని పురస్కరించుకొని వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీచేసి ఆమహనీయుడును గుర్తుచేసుకోవడం మనఅదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.ఈకార్యక్రమాన్ని నిర్వహించిన మరిశర్ల వెంకటేశ్వరరావుని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అభినందించింది.ఈ కార్యక్రమంలో మరిశర్ల వెంకటేశ్వరరావు, అల్లు మురళి, సామిరెడ్డి ఓంకార్, మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు, మరియు అనేకమంది పాల్గొని నివాళులర్పించారని తెలిపారు.

