టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణ.

 టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణ.

భీమిలి వి న్యూస్ 2022 డిసెంబర్ 02

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు శుక్రవారం భీమిలి నియోజకవర్గ పరిధి భీమిలి రూరల్ మండలం అన్నవరంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు ఈ కార్యక్రమంలో అన్నవరం గ్రామం మహిళలు కోరాడ రాజబాబు కి హారతలు ఇచ్చి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించాలని కోరుతూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ నేతలు గ్రామం లో ఇంటి ఇంటికి వెళ్లి రాక్షస ప్రభుత్వం యొక్క రాక్షస పాలన విషయాలు చెబుతూనే చంద్రబాబు పాలనలో ఎంత ప్రశాంతంగా ప్రజలు జీవించేవారో ప్రజలలో అవగాహన కల్పిస్తూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం విజయం లో భాగస్వాములవ్వాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, గోడి అరుణ,రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనందబాబు, విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గాడు అప్పలనాయుడు, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు శ్రీనివాస్,పద్మనాభ మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణ,సరగడ అప్పారావు, సోడిపల్లి నారాయణరావు,నాగోతి సూర్యప్రకాష్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు, బడిగంట నీలకంఠం, నియోజకవర్గ వాణిద్య విభాగ అధ్యక్షులు తాట్రాజ్ అప్పారావు, సోడిపిల్లి జయశంకర్ సాయి, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.