ప్రజాస మస్యలు గాలికివదిలితే ప్రభుత్వాన్నిప్రజలు గంగలో కలుపుతారు సుమా...జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో జనసేన ఇంచార్జీ మాకినీడి శేషు కుమారి ఎద్దేవేత..!!*
పిఠాపురం/ వి న్యూస్ 2002 డిసెంబర్ 02:
ఏ బిడ్డా ఇది జగన్ అడ్డ అన్నట్లుగా సాగుతున్న వై.సి.పి పాలనకు ప్రజలు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని శేషు కుమారి అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము ఈ ఐదు రోజులు జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో స్పష్టంగా ఈ విషయన్ని గమనించామని పార్టీ పిలుపు మేరకు పట్టణంలో స్థానిక యానాధుల కాలనిలో తలపెట్టిన కార్యక్రమంలో ప్రజలు వెల్లువెత్తిన సమస్యలతో ఆవేదన చెందుతున్నారని ఇక్కడ ఈ కాలని వాసులు వీధి లైట్లు లేక చంటి పిల్లలతో చీకట్లో గడుపుతుంటే వార్డు కౌన్సిలర్ పటించుకోలేదని అధికారులు ఏ నాయకుడు పట్టీంచుకోకపోవడంతో కాలని వాసులే చందాలేసుకుని రెండు స్తాంభాలు కొనుకుంటే వాటిని వేయడానికి కూడా ఏ అధికారి రాకపోవడం అంటే పాలన ఏ స్ధాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఇంత ఇబ్బంది పడుతుంటే ఓట్లు వేయించుకున్న కౌన్సిలర్ నిద్ర పోతున్నాడ అని మండిపడ్డారు.
ఇరవై కోట్లు పట్టణ అభివృద్ధి ప్రకటించారు అవి ఇలంటి వాటికీ ఉపయోగించకుండా ఏ గాలికి మళ్ళీంచారో సమాదానం చెప్పాలని కాలనిలో అడుగు పెడితే డ్రైనేజి, పరిసరలు కంపుకొడుతున్నాయని, కొల్లగొట్టే పనులు ఆపి ఇలా కంపు కొట్టే ప్రాంతాలు బాగు చేయడానికి మనసురాని నాయకులకు తొంరలో సాగనంపుతారని జనసేన పార్టీ అధికాంలోకి వస్తే ఈ కాలని కంచుకోట చేస్తామన్నారు. కాలని వాసులను ఆప్యాయంగా పలకరిస్తు మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు జనసేన పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్యప్రకాష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, కంద సోమరాజు,వినయ్,సుబ్రహ్మణ్యం, నామ సాయిబాబు, అంజిబాబు,సింహాద్రి, రాజు, కృష్ణ, శ్రీనివాస్, రాజేంద్ర,జన సైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

