జయహో బీసీ మహాసభను విజయవంతం చేయండి - పిళ్ళా సుజాత సత్యనారాయణ

 జయహో బీసీ మహాసభను విజయవంతం చేయండి - పిళ్ళా సుజాత సత్యనారాయణ


మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 05

డిసెంబర్ 7వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న   జయహో బీసీ మహాసభ ను  రాష్ట్ర నలుమూలలో ఉన్న బీసీ సోదరీ సోదరీమణులు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర నగరాలు (బిసి )కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా పిళ్ళా సుజాత మాట్లాడుతూ  ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే బీసీలకు అధికంగా మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా డిబిటి రూపంలో పేదల ఖాతాల్లో రూ.1.77 లక్షల కోట్లు జమ చేస్తే ఇందులో అగ్ర భాగం రూ.85,915 కోట్ల రూపాయలు బీసీ వర్గాల ప్రజలకి జమ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ చేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా చట్టం తెచ్చారు.

వెనుకబడిన కులాలే వెన్నెముక! ఇందుకు ఉదాహరణగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని బీసీల్లో చేర్చితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  మా నగరాలు సామాజిక వర్గానికి ముందు ఎన్నడూ లేని  విధంగా మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి. అందులో నాకు ఒక చైర్ పర్సన్ స్థానం కల్పించి 12 మంది డైరెక్టర్లు నిర్మించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ నాతోపాటు 9 మంది మహిళలకు స్థానం కల్పించారు. మరియు రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవస్థానమైన విజయవాడ ఇంద్రకీలాద్రి పాలకమండలికి ఒక చైర్మన్ ను, రాష్ట్ర పారిశ్రామిక రాజధానిగా చెప్పుకునే విజయవాడ ప్రాంతానికి ఒక మహిళ  మేయర్ ను, భారతదేశంలో రెండో జ్యోతిర్లింగ స్థానమైన శ్రీశైల దేవస్థానంలో ఒక పాలక మండలి సభ్యుడిని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి పాలకమండలి లో రెండు పర్యాయాలు  ఇద్దరు నగరాలు సామాజిక వర్గం సభ్యులకు స్థానం కల్పించి, వీటితోపాటు  మా నగరాలు సామాజిక వర్గానికి చెందిన 3లాయర్లను  ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లాగా నియమించి మాకు, మా నగరాలు సామాజిక వర్గానికి బీసీల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆమె తెలిపారు.