జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు ప్రభుత్వమే రూ " 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలి

 జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు ప్రభుత్వమే రూ " 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలి:సిపిఐ

జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు ప్రభుత్వమే రూ " 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలి అని ,పూర్తిగా తయారైన టిడ్కో ఇళ్ళు తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చెయ్యాలి అని సోమవారం లబ్ధిదారులచే సిపిఐ పార్టీ సభ్యులు జీవీఎంసీ జోన్ టు  జోనల్ కమిషనర్ కి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు సీపీఐ సభ్యులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కె రెహమాన్ డిమాండ్ చేస్తూ జీవీఎంసీ మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా పలువురూ ఎస్ కె రెహమాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షం నాయకుడు హోదాలో పేద ప్రజలందరికీ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి తీర అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో 34 లక్షలు మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసిన జగనన్న కాలనీలు ఇప్పటికీ చాలా చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని దీనికి కారణం పట్టణానికి దూరంగా స్థలాలు మంజూరు చెయ్యడం ఒక కారణమైతే, ఇంటి నిర్మాణ ఖర్చులు బాగా పెరగడం, ప్రభుత్వం ఇస్తున్న 250 కేజీల ఉక్కు, 90 బస్తాలు సిమెంట్, ఇటుకు సరిపోవని కనీసం 1500 కేజీల ఉక్కు 300 సిమెంట్, నాలుగు వేలు ఇటుకు అవసరం అవుతుందని, అందుకు నిపుణులు అంచనా ప్రకారం రూ " ఎనిమిది లక్షలు అవుతుందని ప్రభుత్వం మంజూరు చేసిన రూ " ఒక లక్ష ఎనబై వేలు ఏమాత్రం చాలక నిర్మాణాలు ప్రారంభం కాలేదని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారులకు రూ " 5 లక్షలు ఉచితంగా సహాయం చెయ్యాలని, అదేవిదంగా ఇప్పటికే పూర్తి చేసిన టిడ్కో ఇళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చెయ్యాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కె రెహమాన్ డిమాండ్ చేసారు.

సిపిఐ మధురవాడ ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యురాలు ఎం డి బేగం తదితరులు మాట్లాడుతూ సుద్దగెడ్డలో టిడ్కో ఇల్లు నిర్మించి ముందు మీకు ఇస్తామని ఇల్లు  పాడగొట్టిన రజకులకు వెంటనే ఇల్లు స్వాధీనం చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం మధురవాడ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము. కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. టిక్కో ఇల్లులు రెండు వారాలో ఇస్తా మనీ హామీఇచ్చారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యురాలు ఏ.దేవుడమ్మ కే.లక్ష్మణరావు సిహెచ్. కాసుబాబు. ఈ. అప్పలరాజు ఎస్కే. మస్తాన్ బి తదితరులు పాల్గొన్నారు