పాలక మండల సభ్యులను చైర్మన్ అశోక్ గజపతిరాజు పట్టించుకోలేదంటూ మహిళా సభ్యురాలు ఆవేదన ముదుండి రాజేశ్వరి.
సింహాచలం:
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుల సమావేశం వేడి వేడిగా జరిగింది...
పాలక మండల సభ్యులను చైర్మన్ అశోక్ గజపతిరాజు పట్టించుకోలేదంటూ మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు...
దేవస్థానం అధికారులు సైతం పాలకమండలి సభ్యులు తెలిపిన సమస్యలను పట్టించుకోలేదంటూ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు...
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్మన్ అశోక్ గజపతిరాజు హాజరయ్యారు....
సుమారు 38 అంశాలు గాను బోర్డు సభ్యులు చర్చించారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క వేతనాలపై ఈ సమావేశంలో కొత్త జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించాలని అధికారులకు సూచించారు...
ఈవో త్రినాథరావు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వేతనాలపై కాంట్రాలతో చర్చిస్తామని తెలిపారు...
పంచ గ్రామాల లోఉన్న ఇళ్ల నిర్మాణాలపై, మరమ్మత్తులపై సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు తెలిపారు..

