5వ వార్డులో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్పొరేటర్ మొల్లి హేమలత
5వ వార్డులలో సుడిగాలి పర్యటన చేసిన జీ.వీ.ఎం.సీ. కమిషనర్ పి.రాజుబాబు .
మధురవాడ:
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ పి.రాజుబాబు మంగళవారం జోన్-2 పరిధి లోని 5వ వార్డు పరిధిలో కొండవాలు ప్రాంతాలైన శివశక్తినగర్ రోడ్డు, అయ్యప్పనగర్,వివేకానంద నగర్,ముత్యాలమ్మకాలనీ, గాంధీనగర్,మరియు బొట్టవానిపాలెం,సాయిరాం కాలనీ,మారికవలస, తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ మొల్లిహేమలత,టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు తో కలసి సుడిగాలి పర్యటన చేశారు.ఈసందర్భంగా కమిషనర్ రాజుబాబు 5వవార్డు లో కొండవాలు ప్రాంతాల ప్రాజెక్టులు వాటి నిర్వహణ, మంచినీటి కొళాయి కనెక్షన్లు మంజూరు,కొండవాలు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్స్, కాలువలు,డ్రైన్లు,మారికవలస రాజీవ్ గృహకల్ప యూజీడీ సమస్య, వార్డు పరిధిలోని పార్కులు, వీధి దీపాలు,స్మశాన వాటికలు వాటి సమస్యలు,నిర్వహణ పరిశీలించారు.ప్రజలు పడుతున్న సమస్యలను కమిషనర్ కు కార్పొరేటర్ హేమలత వివరించారు. ముత్యాలమ్మకాలనీ, గాంధీనగర్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణమే రోడ్లు,మంచినీటి కొళాయిలు మంజూరు చేయాలని ప్రత్యామ్నాయం చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్య సమస్య అయిన పందులు సంచారం అధికంగా కనిపిస్తున్నాయని వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ వలన మారికవలస రాజీవ్ గృహకల్ప, బోరవానిపాలెం ప్రజలు పడుతున్న అవస్థలను కార్పొరేటర్ కమిషనర్ కు వివరించారు.అనంతరం సర్వే నంబర్ 61లో గల బొట్టవానిపాలెం కొత్తచెరువు(వెంపల చెరువు) ను పరిశీలించారు. బొట్టవానిపాలెం చెరువును సంరక్షించుకుని అభివృద్ధి చేస్తే చుట్టుప్రక్కల గ్రామాలకు నీటి కష్టం తీరుతుందని కమిషనర్ కు కార్పొరేటర్ హేమలత వివరించారు.కమిషనర్ పి.రాజుబాబు స్పందిస్తూ.. చెరువు ఆధునీకరణలో భాగంగా 4ఎకరాల 80సెంట్ల విస్తీర్ణంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనిపై అధికారులకు స్కెచ్ డిజైన్ చేయాలని, సూచనలు ఇచ్చారు.
5వ వార్డులలోని స్మశాన వాటికలలో మౌళిక వసతులైన షెడ్లు,విద్యుత్,త్రాగునీరు ఏర్పాటు చేసి అభివృద్ధి పరచాలని కార్పొరేటర్ కమిషనర్ కు తెలిపారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ వలన సమస్యలు, కొండవాలు ప్రాంతాలైన సాయిరామకాలనీ,సర్వేనెంబర్ 27లో అయ్యప్పనగర్, వివేకానందనగర్, ముత్యాలమ్మకాలనీ, గాంధీనగర్,సద్గురు సాయినాథ్ కాలనీ,శివశక్తినగర్,మరియు శారదనగర్ ప్రాంతాలలో తక్షణమే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సహకరించాలని కార్పొరేటర్ కోరారు. ఈసందర్భంగా జివిఎంసి కమిషనర్ కమిషనర్ రాజుబాబు స్పందిస్తూ.. త్వరలోనే సమస్యలను పరిష్కారం దిశగాతీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈపర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్ జి శాస్త్రి,జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్యనిర్వాహక ఇంజినీరు వంశి,ఎసిపి శాస్త్రి షహనాబ్, ఎఎంఒహెచ్ కిషోర్, ఉపకార్వనిర్వాహక ఇంజినీరు,ఇంజినీరు,శానిటరీ సూపర్వైజర్,శానిటరీ ఇన్స్పెక్టర్,వార్డు-సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


