ఆటో రిక్షా డ్రైవర్లు పై అర్ టీ ఏ అధికారుల దౌర్జన్యం,బెదిరింపులు ఆపాలి. సీఐటియు

ఆటో రిక్షా డ్రైవర్లు పై అర్ టీ ఏ అధికారుల దౌర్జన్యం,బెదిరింపులు ఆపాలి. సీఐటియు..

మధురవాడ:

ఎన్నడూ లేని విధంగా ఆర్టిఏ అధికారులు ఆటో రిక్షా డ్రైవర్లపై దౌర్జన్యం చేస్తూ జులుం ప్రదర్శిస్తున్నారని ఇది అన్యాయమని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ( సిఐటియు) నగర అధ్యక్షులు పి రాజ్ కుమార్ అన్నారు.నగరం లో ప్రభుత్వం ఏదైనా భారీ సభలు నిర్వహించిన,ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రులు వస్తే ఆటో డ్రైవర్ లు భయం తో ఆందోళన చెందుతున్నారని తెలియ జేశారు.అర్ టీ ఓ అధికారులు,సిబ్బంది బుధవారం మధురవాడ లో అన్ని ఆటో స్టాండ్ ల వద్దకు వెళ్ళీ ప్రధాన మంత్రి మోడీ సభకు ఆటో లన్ని 12 తారికున తరలించాలని చెప్పారు.గతంలో రెండు సార్లు ఇలా ముఖ్యమంత్రి సభకు బలవంతంగా ఆటోలు పెట్టించారనీ.ఆరోజంతా తిప్పీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు.దానికి కోపోద్రిక్తులైన ఆర్ టి ఓ అధికారాలు ఆటోలు పెట్టక పోతే 13 వ తేదీ నుంచి మీ స్టాండ్ వచ్చీ ఒక్కొక్కరికి 20 వేలు జరిమానా లు వేస్తానని బెదిరింపులు చేశారు.ఆటో కార్మికులు తీవ్ర అవేదన చెందారు.ఈ పరిణామంతో జీ వి ఎం సి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.అర్ టీ ఓ అధికారులు ఇలా భయ బ్రాంటులకు గురు చేయడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.లేక పోతే ఆటోలలో అర్ టీ ఓ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జి చిన్నారావ్,డి రవి,ఆటో సంగం జోన్ కార్యదర్శి టి రమేష్ బాబు,కే వీరు బాబు,కే సంతోష్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.