రాజీవ్ గృహకల్పకాలనీలో పర్యటించిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత.

రాజీవ్ గృహకల్పకాలనీలో పర్యటించిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత.

యు.జి.డి.పైప్ లైన్ సమస్యకు స్పందించి,తక్షణమే సిబ్బందితో నిర్మూలనచర్యలు.                                                                             

నవంబర్ 11: మధురవాడ::



           జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత స్థానికుల విజ్ఞప్తి మేరకు వార్డు పరిధిలోగల మారికవలస రాజీవ్ గృహకల్పకాలనీ,జే.ఎన్ ఎన్.యు.ఆర్.ఎమ్. కాలనీలలో పర్యటించి స్థానిక ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అక్కడ ప్రజలు ముఖ్యంగా యు.జి.డి. పైపులైన్ల నిండిపోయి తీవ్ర దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామనికార్పొరేటర్ కు తెలియజేశారు.కార్పొరేటర్ హేమలత స్పందిస్తూ..తక్షణమే జీవీఎంసీ శానిటేషన్, యు.సి.డి.సిబ్బందిని రప్పించి యుద్దప్రాతిపదికన సిబ్బందితో నిర్మూలనచర్యలు చేపట్టించారు.ఈసమస్య పై  వీలైనంత త్వరగా జివిఎంసి కౌన్సిల్లో అధికారులతో మాట్లాడి యు.సి.డి, మురుగునీటి కాలువలు, కల్వర్టులు డ్రైనేజీ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపుతానని,స్థానిక ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు,వార్డ్ సచివాలయ సెక్రటరీలు స్థానిక వాలంటీర్లు సిబ్బంది పాల్గొన్నారు.