బొడ్డుమామిడి గ్రామంలో నాలుగు గడ్డి ఇండ్లు దగ్ధం.
ఐదు లక్షల ఆస్తి నష్టం.
కట్టుబట్టలు. ధాన్యం. సామానులు. సర్వం కోల్పోయిన ఆదివాసులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం గడుతురు పంచాయతీ బొడ్డు మామిడి కొండ శిఖర గ్రామంలో 28 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. 8వతేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గ్రామస్తులందరూ వ్యవసాయ కోతల సమయంలో కొండపోలు వద్ద తమ సొంత పనులు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల ముగ్గురే ఇంటి వద్ద వదిలేశారు మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో .1 పాంగి గాసి.2 పాంగి మొల్లు 3. వంతుల సోమేశ్వరరావు 4. పాంగి సుధాకర్ నాలుగు ఇల్లులు కాలిపోయాయి. ఇంటి మంటలు అదుపు చేస్తున్నటువంటి వంతుల చందర్రావు. వంతల వెంకట్రావు వీరిద్దరూ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పంచాయతీ కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం బొడ్డు మామిడి. రోడ్డు సౌకర్యం లేదు. ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే. అడవుల్లో దొరికే దబ్బ గడ్డి రెండు నెలలు కష్టపడి గడ్డిని సేకరిస్తేకుటుంబం మొత్తం కష్టపడి పనిచేయాలి. అలాంటిది ప్రకృతి వైపరీత్యాలు సర్వం కోల్పోయే పరిస్థితి. అగ్నిమాపకు వాహనం రావాలంటే 20 కిలోమీటర్ల వరకే వస్తుంది. మిగతా ఎత్తైన కొండల మధ్య ఉండడం వల్ల ఈ గ్రామం డోలి మోయలేక అనేకమంది గ్రామాల్లోనే మరణిస్తున్నారు. ఈ గ్రామానికి ఎవరు అధికారులు వెళ్లారు. ఇది అనకాపల్లి జిల్లా చీమలపాడు పంచాయతీ కొండశేఖర్ గ్రామం నుండి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్ల దూరం. అందువల్ల నేటికీ ఎటువంటి అధికారులు కి వెళ్ళరు సమాచారం కూడా రాదు. తక్షముగా తక్షణమే సబ్ కలెక్టర్. సందర్శించి బాధిత కుటుంబాలకి ప్రభుత్వ నష్ట పరిహారం ఇవ్వాలని బట్టలు. వంట సామాగ్రి సమకూర్చాలని. రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పి చంద్రయ్య. గిరిజన సంఘం నాయకులు పాంగి సూరిబాబు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు జిల్లా కలెక్టర్ ని. ఐ టి డి ఎ పి ఓ సబ్ కలెక్టర్ కి వేడుకున్నారు.

