రజక ఆత్మ గౌరవ దీక్ష సమావేశంలో సంఘీభావం తెలిపిన మధురవాడ రజక సంఘం సభ్యులు ...
మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి
రాజకీయ పార్టీలకు అతీతంగా 6,7,8 తేదీల్లో విజయవాడలో రజక ఆత్మ గౌరవ దీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భీమిలి నియోజకవర్గం మధురవాడ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు .
ఈ దీక్ష లో పలువురు నేతలు మాట్లాడుతూ ముఖ్య ఉద్దేశం రజకులను ఎస్సీ లో కలపాలి. మరియు అంధ్రప్రదేశ్ లో రజక మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి, అదేవిధంగా భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్న మరియు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీలు కలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మధురవాడ రజక సంఘం ప్రెసిడెంట్ నరవ చంటి వైస్ ప్రెసిడెంట్ కే చంద్ర రావు బి చందర్రావు పి అప్పలరాజు సంఘీభావం తెలిపారు.

