ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పర్యావరణ విధ్వవంశం.సీపీఎం..
కొమ్మాది:
విశాఖ రూరల్ మండలం, జీవీఎంసీ ఆరో వార్డు పరిధిలో, మరియు ఐదో వార్డు పరిధిలో కొమ్మాది విలేజి, బోరవాణి పాలెం, ఉప్పాడ ప్రాంతాలలో పచ్చటి కొండలను తవ్వేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని సిపిఎం మధురవాడ జోన్ కార్యదర్శి డి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం కొమ్మది ప్రాంతంలో కొండలు తవ్వుతున్న ప్రాంతాన్ని విలేఖర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో ఇవ్వవలసిన రాయితీలు, అమలు చేయవలసిన హామీలు ఏవి ఇవ్వకపోయినా పర్యావరణాన్ని మాత్రం నాశనం చేసి కాలుష్యం ఇస్తున్నారని అన్నారు. ఈ తవ్వకాలపై మండల రెవిన్యూ వారిని వివరణ కోరగా ప్రధాని సభకు గ్రౌండ్ చదును చేయడానికి ఈ మట్టిని తరలిస్తున్నట్లు తెలియ జేశారు.
ఆధి కూడా వుడా, ఏ పి హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తున్నారని తెలియ జేశారు.ఇప్పటికే అనేక భారీ భాహిరంగ సభలు ఈ ఏ యు మైదానంలో జరిగాయని ఇప్పటి వరకు అవసరం లేనిది ఇంత భారీగా కొండలు త్రవ్వి మట్టిని తరలించ వలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు.వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం భాద్యతలను తీసుకునే దాన్లో భాగంగా, అత్యుత్సాహంతో ఈ పర్యావరణ విద్వాంసానికి పాల్పడుతుందని అన్నారు. మన రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని ప్రభుత్వం పర్యావరణాన్ని పాడు చేసే విదంగా త్రవ్వకాలు చేయడం ఆపాలని కోరారు.ప్రధాని ప్రసంగించే వేదిపై నుండే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ వెంటనే ఆపాలని మన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.పాలక పార్టీ పెద్దలు డిమాండ్ చేయాలని కోరారు.విభజన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు హామీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అలా చేయకుండా ప్రధానమంత్రి, బిజెపి నేతల మెప్పుకోసం పాకులాడకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా త్రవ్వ కాలని వెంటనే ఆపాలని కోరారు.లేక పోతే ప్రజా సంఘాలతో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.


