రెండవ జోన్ పరిధిలో ఈ నెల 10, 12వ తేదీలలో త్రాగునీటి అంతరాయం
మధురవాడ:
విశాఖపట్నం, నవంబర్-8:- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ రెండవ జోన్, వార్డు నెం. 5, 6, 7 & 8 లలో త్రాగునీటికి అంతరాయం కలుగునని జివిఎంసి కార్యనిర్వాహక ఇంజినీరు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం జాతీయ రహదార పనుల వలన కలిగే ఆటంకం, పైపుల మార్పులు, లీకులు అరికట్టేందుకు ఈ నెల 10, 11వ తేదీలలో దిగువ తెలిపిన ప్రాంతాలలో త్రాగునీరు సరఫరా నిలుపబడునని తెలిపారు. 10వ తేదీన వార్డు నెం. 6లో ఆర్. హెచ్. కోలనీ, లక్ష్మివాని పాలెం, అశోక్ నగర్, బక్కన్న పాలెం, కొమ్మాది, రేవళ్ళపాలెం, రిక్షా కోలనీ, ప్రశాంతి నగర్, వైభవ్ నగర్, వల్లీ నగర్, వార్డు నెం. 07లో పాత మధురవాడ, ఎస్..జి.ఓ కోలనీ, మిదిలాపురి ఉడా కొలనీలోని ఒక భాగం, 11వ తేదీన వార్డు నెం.-5లో సాయంకాలం కోలనీ ఫేజ్ – 1, సాయిరాం కోలనీ, డ్రైవర్స్ కోలనీ, బోరువాని పాలెం డ్రైవర్సు కోలనీ, 6వ వార్డులో సూర్య ప్రెస్, కొమ్మాది ఎస్.సి. కోలనీ, దేవి మెట్ట M1, K1, K2, K3, పోతినమల్లయ్య పాలెం – హౌసింగ్(ఎల్.ఐ.జి, ఎం.ఐ.జి.లు), ఆర్.హెచ్. కోలనీ, 7వ వార్డులో కృష్ణా నగర్, చంద్రం పాలెం ఎస్..జి.ఓ కోలనీ, మిదిలాపూరి ఉడా కోలనీ భాగం, వాంబే కోలనీ, పాత మధురవాడ, ఆర్.టి.సి. కోలనీ, 8వ వార్డులో మిదిలపురి ఉడా కోలనీ కొంత భాగం అంతరాయం ఏర్పడునన్నారు, ,
కావున ప్రజలకు తరగునీటికి కలుగు అసౌకర్యానికి చింతిస్తూ మంచి నీటి సరఫరా విభాగం, జివిఎంసి వారికి నగర ప్రజలు సహకరించవలసినదిగా కమిషనర్ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.

