ఆరుకు అందాలు అద్భుతం.విహార యాత్రికులకు కనువిందు చేసే ప్రదేశాలు
ఆరుకు:
 |
| మడగడ సన్ రైజ్ పాయింట్ |
విహారయాత్ర చేసే సందర్శకులకు కార్తీకమాసంలో విహార యాత్ర ప్రత్యేకం. విహారయాత్ర అనగానే మొదట గుర్తుకొచ్చేది ఊటీ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది మంచుతో కప్పబడిన కొండలు. చల్లని వాతావరణం అలాoటి ఊటీ ని మైమరపిస్తోంది ఆరుకు.విహారయాత్రలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకు అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవని విహార యాత్రికులు అంటున్నారు.ఇది వరకు ఆరుకు విశాఖ జిల్లాలో ఉండేదీ. ప్రస్తుతం ఆరుకు ఏప్రిల్ మాసం నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజింపబడింది.ఆరుకు రైలు ప్రయాణం చేసే సందర్శకులకు రైలు కొండల మధ్యలో నుండి టరనెల్స్ లోపల నిర్మించిన ట్రాక్ పై వెళ్తుంటే అనుభూతి ఎనలేని విధంగా ఉంటుంటారు.ఆరుకు లోయలలో ముందుగా బొర్రా గృహాలు.1807లో బ్రిటిష్ వారు రైలు ట్రాక్ కొరకు నిర్మాణంలో కనిపించిన బొర్రా కేవ్స్ భారత దేశంలోనే అందంగా ఉండే అద్భుత గృహాలుగా గుర్తింపు పొందాయని అంటున్నారు. బొర్రా గృహలనుండి అరకు వెళ్లే దారిలో గాలిగొండ వ్యూ పాయింట్ వద్ద నుండి కొండ లోయలు చూడాలి అంటే కడు కమనీయంగా ఉంటాయoటారు. అరకు వ్యాలీలో ఆదివాసుల గురించి తెలియజేసే మ్యూజియం,పద్మావతి గార్డెన్స్,కాఫీ ఫ్యాక్టరీ,దిమ్షా డాన్స్, బొర్ర కేవ్స్,నలుమూలల జలపాతాలు అందులో కటిక వాటర్ ఫాల్స్ లో 300అడుగుల ఎత్తునుండి రాళ్లపై నుండి పారె జలపాతం చూసేవారు అద్భుత అనుభూతి పొందుతారు. చాప రాయి జలపాతం,రనజిల్లెడ జలపాతం ఇంకా చాలా వున్నాయి. అరకు వ్యాలీ నుండి పదిహేను కిలోమీటర్లు దూరంలో మడగడ, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద దివి నుండి భువికి మేఘాలు దిగేట్టు మంచు దృశ్యాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. 40కిలోమీటర్లు దూరంలో లంబశింగి,60కిలోమీటర్లు దూరంలో ఓనకఢిల్లీ ల లో సన్ రైజ్ పాయింట్ లు ఉన్నాయి. ముందుగా ఆరుకు అంటే పసుపు పువ్వుల తోటలు గుర్తువస్తాయి. సినిమా రంగానికి ఆరుకు తక్కువ బడ్జెట్ మంచి సినిమాలు నిర్మించే చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.ఆరుకు ఒక్కసారి సందర్శించిన సందర్శకులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటాయని తెలుపుతున్నారు.
