మినీ రోల్ బాల్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులు అందజేసిన: గంట శ్రీనివాసరావు
విశాఖ వి న్యూస్ ప్రతినిధి:
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదివారం విశాఖ రోల్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మురళి నగర్ వైశాకి స్పోర్ట్స్ పార్క్ నందు నవంబర్ 5 మరియు 6 వ తేదీలలో నిర్వహిస్తున్న 3వ సౌత్ ఇండియా మినీ రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ పోటీలలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడం ద్వారా వారి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతుందని మరియు క్రీడలు వలన ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
ఈ సందర్భంగా మురళీ నగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ప్రెసిడెంట్ సనపల వరప్రసాద్ మరియు కమిటీ సభ్యుల, క్రీడా కోచ్ లను, క్రీడా బృందాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ పి వి ఎన్ మాధవ్ , విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు , మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి శ్రీనివాసరావు, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్, విశాఖ జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, జిల్లా తెలుగు యువత కార్యదర్శి ధనాజి గౌడ్, జిల్లా పార్టీ తెలుగు మహిళా అధికార ప్రతినిధి ప్రమీల రావు, విశాఖ జిల్లా పార్లమెంటరీ ఐటిడిపి ప్రెసిడెంట్ నరేష్, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, గొంప ధర్మారావు, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, 47వ వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను, ఏడుకొండలు, నియోజకవర్గ బి సి సెల్ వైస్ ప్రెసిడెంట్ కోలా రామారావు, 49వ వార్డు సెక్రటరీ వాసు, నాయకులు కార్యకర్తలు, క్రీడాకారులు మరియు అభిమానులు పాల్గొన్నారు

