విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కు అన్ని విధాలా కృషి చేస్తా: గంటా శ్రీనివాసరావు

 విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కు అన్ని విధాలా కృషి చేస్తా: గంటా శ్రీనివాసరావు

విశాఖ వి న్యూస్ ప్రతినిధి:

మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు తన నివాసంలో విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్, కన్వీనర్ కో కన్వీనర్స్ మరియు కమిటీ సభ్యులు మరియు అన్ని సంఘాల మరియు పార్టీల నాయకులు మరియు మాజీ మంత్రి  బండారు సత్యనారాయణమూర్తి , మాజీ శాసనసభ్యులు  పల్లా శ్రీనివాసరావు  లతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా అనేక ఉద్యమాలు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం లో ఎటువంటి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. అందుకే తాను ఈ సమావేశం ఏర్పాటు చేసి పార్టీలు మరియు సంఘాలకు అతీతంగా అందరూ కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. 

ఈ సందర్భంగా అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం తో విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుటకు ఎన్నో ప్రాణాలను సైతం కోల్పోయి ఈ కర్మాగారం సాధించుకున్నామని. మరలా ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టడం జరిగింది అన్నారు. ప్రయివేటీకరణ వలన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే తాను అన్ని సంఘాల నాయకులు మరియు అన్ని పార్టీల నాయకుల తో చర్చలు జరిపి ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. మరియు విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట కమిటీ కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అలాగే వచ్చే 11వ తేదీ న గౌరవ ప్రధాన మంత్రి కి విశాఖ ప్రజల మనోభావాలను స్పష్టం గా తెలియజేయాలని, ఆ విధంగా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. తాను విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినా ఆమోదించలేదని మరియు స్పీకర్ ఫార్మాట్ లో తాను స్వయంగా స్పీకర్ కి లేఖ అందించినా ఆమోదించలేదనీ మరలా తాను లేఖ సమర్పించుటకు సిద్ధమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కు అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా  శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ కన్వీనర్ కో కన్వీనర్స్ మరియు అన్ని సంఘాల నాయకులు మరియు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.