జలపాతం లో జారిపడి ఇంటర్ విద్యార్థిని మృతి

అనంతగిరి జలపాతం లో జారిపడి ఇంటర్ విద్యార్థిని మృతి.

అనంతగిరి:

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం అనంతగిరి స్థానిక తాడీ గుడ జలపాతం వద్ద శనివారం సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపేందుకు కలిసి వెళ్లి ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు జలపాతం వద్ద జారిపడి అక్కడికక్కడే మృతిచెందింది. వివరాల్లోకి వెలితే.. అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ కరాయిగూడ గ్రామానికి చెందిన జనం.జయంతి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరము చదువుతూ ఉండేది. విషయం విన్న అనంతగిరి పోలీసులు సంఘటన స్థలనికి చేరుకొని కేసును దర్యాప్తూ చేసి పంచనామా నిమిత్తం అరకు ఏరియా హాస్పిటల్ కు పార్దివదేహాన్ని తరలించారు.